Live a better life, with vedas!
Vedic Articles & Discussions
Category: Q&A | 1 min read
హేతువాది ప్రశ్నలు - వివాహ వ్యవస్థ
ఈ విభాగం శాస్త్రి మునగాల మరియు డా వెంకట చాగంటి గారు ఒక హేతువాదతో(పేరు తెలపలేదు) జరిగిన ప్రశ్నల పరంపరలో ఒక భాగము. ఇందులో ముఖ్యంగా చాగంటి గారు వివాహ వ్యవస్థ అవసరమా అనే అంశం లో హేతువాది అంగీకరించడము జరిగిందని తెలియజేశారు. హేతువాది ప్రకారం వివాహ వ్యవస్థ అనేది మానవ పరిణామ క్రమంలో పుట్టిన ఒక అంగీకారము మరియు విచక్షణ ఆధారంగా ఏర్పడి ఉండోచ్చని, దానికి ఏ విధమైన వ్రాత పూర్వక ఆధారాలు లేవు అని తెలిపారు.
చాగంటి గారు హేతువాది ఆధారం చూపలేదు కాబట్టి వారి యెుక్క వాదన లో శాస్త్రియ ఆధారము లేదు అని అది సార్వజనీనము కాదని తెలియజేశారు. అపౌరుషేయమైన, సనాతనమైన వేదాలలో వివాహ వ్యవస్థ గురించి నిర్దుష్టమైన ఆధారము మరియు వివరణ ఉంది అని తెలియజేశారు. వేద ప్రమాణము ఎన్నో వేల ఏళ్లుగా ప్రపంచంలోని అందరూ అంగీకరించారు కానీ ఈ హేతువాది కేవలం తనకు అనుకూలమైన సంకుచిత దృక్పథాన్నే ప్రదర్శిస్తున్నారు. ఒకే కుటంబంలోని స్తీ పురుషులు (తోబుట్టువులు) ఎందుకు వివాహము చేసుకోకూడదు అనే శాస్త్రీయ ఆధారము హేతువాది చూపలేక పోయాడు. వివాహ వ్యవస్థ అనేది హేతువాది ప్రకారం శాస్త్రీయమా లేక సాంఘిక కట్టుబాటు మాత్రమేనా, ఉంటే దాని చరిత్ర ఏమిటి మెుకలైన ప్రశ్నలు చాగంటి గారు సంధించారు.
చాగంటి గారు హేతువాదికి విద్యా వ్యవస్థ యెుక్క ఉద్ధేశ్యాన్ని తెలియజేస్తూ ఆ పునాది లేకుంటే మనిషి యెుక్క వివేచన, విచక్షణ పెంపోందవు అని వివరించారు. ఇటువంటి గోప్ప వ్యవస్థను మెుదట తెలిపింది వేదము అని, దాని నుండే ప్రపంచమంతా విద్యా వ్యవస్థను నేర్పుకుందని సోదాహరణంగా వివరించారు.
హేతువాది డి.ఎన్.ఏ ప్రశ్నకి చాగంటి గారు వివరణ ఇస్తూ ఈ ఆధునికి పరిజ్ఞానము 1850 లో మెుకలైందని కానీ అంతకంటే ఎన్నో వేల ఏళ్లకు ముందే వేదం అందించిన జ్ఞానంతో సమాజం వివాహ వ్యవస్థను ఏర్పర్చారని వివరంచారు. సంకుచిత దృష్టితో కాకుండా హేతువాదులు శాస్త్రీయ దృక్పథంతో వేదాధ్యయనం చేసి వివరాలు తెలుసుకోవాలని, అప్పుడే ఇంకోకరిని ప్రశ్నించాలని తెలియజేశారు. భజనీయుడు, గురువులకే గురువు కావున సనాతన ధర్మములో వేదము ఆధారంగా భగవంతుడిని ఆరాధిస్తారు అని స్పష్టంగా తెలియజేశారు
Date Posted: 28th October 2024